తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం
న్యూస్ పవర్ , 2 నవంబర్ , ఇల్లంతకుంట :
మునుగోడు నియోజకవర్గ తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఎన్నికల ప్రచారంలో ఈటల.రాజేందర్ పై దాడి చేయడాన్ని ఖండిస్తూ ఇల్లంతకుంట మండల బస్టాండ్ తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి దిష్టి బొమ్మ, కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తు బెంద్రం. తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి.రాజగోపాల్ రెడ్డి కి అండగా వుంటూ బీజేపీ నీ భారీ మెజారిటీ తో గెలిపిస్తారని ఇర్ష ద్వేషంతో మునుగోడు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటల. రాజేందర్ సతీమణి ఊరిలో ప్రచారం చేస్తుంటే అటుగా తెరాస కార్యకర్తలు బైక్ ల పై వచ్చి పిచ్చి పిచ్చి గా హారన్లు కొట్టి డిస్టర్బ్ చేస్తుండం వాళ్ళ పిచ్చి తనానికి నిదర్శనమన్నారు,బీజేపీ ప్రచారా వాహనాలను ధ్వంసం చేయడాన్ని తెరాస సిగ్గుమాలిన చర్యలు అన్నారు వెంటనే తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నీ తన కార్యకర్తలను అరెస్టు చేయాలనీ ప్రజాస్వామ్యన్ని కాపాడాలన్నారు, మీరు ఎంత చేసిన ముముగోడు ఎన్నికల్లో బీజేపీ రాజగోపాల్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపిస్తున్నరన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు బొల్లరం.ప్రసన్న, బత్తిని.స్వామి, దేశెట్టి.శ్రీనివాస్, గజ్జల.శ్రీనివాస్, బోయిని.రంజిత్, దండవేణి. రజినీకాంత్, సింగరి.శ్రీనివాస్, నాగసముద్రాల.సంతోష్, బండారి.రాజ, వజ్జపెల్లి. శ్రీకాంత్, పొన్నం,కృష్ణ, పల్లె.సాయిప్రసాద్ రెడ్డి, పయ్యావుల.నవీన్, నర్సయ్య, పున్ని. ప్రశాంత్, అంతటి.వేణు, ముత్తక్క గౌరవేణి.నరేష్, రమేష్ తదితరులు పాలుగోన్నారు.
మీ యొక్క బైక్, కారు ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి👇
మీరు షాప్ , హోటల్స్, రియల్ ఎస్టేట్,షోరూం, రిపేర్ , బుక్ స్టాల్, జనరల్ స్టోర్స్ , మీ బిజినెస్ ఏది ఐనా మీ బిజినెస్ నీ ఈ వెబ్సైట్ ద్వారా ఫ్రీ గా ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో ప్రతి రోజు 5000 మంది న్యూస్ చదువుతున్నారు. కావున ఒక్కరోజులోనే మీ బిజినెస్ ఎక్కువ మంది చేరుతుంది.
పూర్తి వివరాలకు సంప్రదించండి: 9490217612
0 Comments