JSON Variables

ఎగ్జిట్ పాలసీ లేదనటం సరికాదు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండించిన టిఎస్ యుటిఎఫ్ .



ఎగ్జిట్ పాలసీ లేదనటం సరికాదు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండించిన టిఎస్ యుటిఎఫ్ .



 న్యూస్ పవర్ , 13 నవంబర్ , ఇల్లంతకుంట :
జాతీయ పెన్షన్ పథకాన్ని అంగీకరించి అమలు జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు బయటకు వచ్చే స్వేచ్ఛ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానిచటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ప్రపంచ బ్యాంకు షరతులకులోబడి కార్పోరేట్ వ్యాపారుల షేర్ మార్కెట్ వ్యాపారంలో ఫైనాన్స్ క్యాపిటల్ గా పబ్లిక్ మనీని వినియోగించుకోవటానికే చందాతో కూడిన పింఛన్ పథకాన్ని అమలు చేస్తున్నారని, వారి ప్రయోజనాలు కాపాడటానికే నిర్మలా సీతారామన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని టిఎస్ యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ కొండికొప్పుల రవి విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... 2004లో బిజెపి ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టగా తదనంతరం అధికారంలోకి వచ్చిన యుపిఏ ప్రభుత్వం దొడ్డిదారిన రాష్ట్రాల్లో  అమలు జరిపించిందని గుర్తుచేశారు. కుటుంబాల సామాజిక భద్రత పట్ల ఆందోళన చెందుతున్న సిపిఎస్ ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు దేశవ్యాప్తంగా సిపిఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో పాలక పక్షాలు రాజకీయ అస్థిత్వం కోసం ఉద్యోగుల డిమాండ్ కు తలొంచక తప్పటం లేదన్నారు. 
ప్రజలకు చెందాల్సిన పెన్షన్ సొమ్ము ప్రభుత్వాలకు కాదని వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రికి నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే పిఎఫ్ఆర్డిఎ చట్టాన్ని రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ను పునరుద్దరించాలని శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. కనీసం పాత పెన్షన్ విధానంలోకి మారడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ నిచ్చేవిధంగా ఫిఎఫ్ఆర్డిఎ చట్టాన్ని సవరించాలని వారు కోరారు. జాతీయ విద్యావిధానం, జాతీయ పింఛన్ పథకం రద్దు కోరుతూ ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సంతకాల సేకరణలో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొనాలని  పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments