రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాద్యాయులు గా మల్లేశం అరుకుటి
ఆవిష్కార్ పౌండేషన్ ఇండియా (మహరాష్ట్ర) ఎన్ జి ఓ వారిచే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జవారిపేటప్రదానోపాధ్యాయులు అరుకుటి మల్లేశం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆదివారం సలార్జింగ్ మ్యూజియం హైదరాబాద్ లో అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డును రాష్ట్ర మానవహక్కుల కమిటీ చైర్ పర్సన్ జస్టిస్ చంద్రయ్య ,డిప్యూటి కమిషన్ ఆప్ పోలీసు హైదరాబాద్ మధుకర్ స్వామి, అవిష్కర్ ఫౌండషన్ అధ్యక్షులు సంజయ్ పవార్, అవిష్కర్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షులు షాద్రక్, సుదరయ్య సెక్రటరీ లు ప్రధానం చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అరువది ఏడు మందికి అవార్డును అందించినారు. మల్లేశం కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ రావడంపట్ల తోటి ఉపాధ్యాయులు,స్నేహితులు అభినందించారు.
0 Comments