JSON Variables

కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఇంటింటి ప్రచారం

కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఇంటింటి ప్రచారం


న్యూస్ పవర్, 16 అక్టోబర్, ఇల్లంతకుంట :
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ  జన్మదిన సందర్భంగ సెప్టెంబర్ 17 నుండి దేశంలోని దళితుల అభివృద్ధి కొరకై బస్తీ సంపర్క్ అభియాన్ ద్వారా దేశంలోని 75 వేల దళిత బస్తిలలో కేంద్ర పథకాలను వివరిస్తూ లబ్ది చేకూరే విధంగా దళితుల అభ్యున్నతికై పాటుపడే విధంగా ప్రతి బిజెపి కార్యకర్త ముందుండాలని ఇచ్చిన సందేశాలు మేరకు నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలోని దళిత బస్తీలో ఇంటింటి కి తిరిగి వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడం జరిగింది. అదే విధంగా కార్యక్రమ అనంతరం దళిత మోర్చ మండల అధ్యక్షుడు ఎలుక రామస్వామి మాట్లాడుతూ నేడు తెలంగాణ బిజెపి దళిత  మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా  ఆదేశానుసారం తాళ్లపల్లి గ్రామంలో మొదలైన బస్తీ సంపర్క్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని ఇట్టి కార్యక్రమం నవంబర్ 26 వరకు నిర్వహిస్తామని తెలిపారు ,ఇట్టి కార్యక్రమం ద్వారా దళితుల అభ్యున్నతి మా ధ్యేయమని తెలిపారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ. దళితులపై కపట ప్రేమ నటిస్తూ కేవలం ఓటు బ్యాంకు గానే గుర్తింపు ఇచ్చి ఎన్నికల సందర్భంగా దళితులకు ఇచ్చిన హామీలు దళిత ముఖ్యమంత్రి,మూడు ఎకరాల భూమి, దళిత బంధుపథకం,120 అడుగుల అంబేద్కర్  విగ్రహం హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. పదే పదే దళితులను మోసం చేస్తున్న  దళిత ద్రోహి కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించెంతవరకు దళితులందరం ఏకమై తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొడుతాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు దామెర కృష్ణకాంత్, కాత మల్లేశం,దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, దళిత మోర్చా మండల ఉపాధ్యక్షుడుమామిడి శేఖర్, ఇల్లంతకుంట పట్టణ అధ్యక్షుడు తిప్పారాపు శ్రవణ్, బంగారు మల్లేశం, జుట్టు నర్సయ్య, జుట్టు కొమురయ్య, ఎలుక అజయ్, జుట్టు సురేందర్, శ్రావనపెల్లి విష్ణువర్ధన్, జుట్టు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments