తోటి మిత్రుడి కుటుంబానికి చేయూత
న్యూస్ పవర్,16 అక్టోబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కునబోయిన శ్రీనివాస్ 38 స" ఇటీవల ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకొని మరణించాడు. ఇతనికి భార్య విజయ 30 స". కొడుకు వర్షిత్ 10 స " వున్నారు.రెక్కాడితే డొక్కాడని ఈ కుటుంబం దారిద్య్ర రేఖ కి దిగువన వున్నారు. *2000 బ్యాచ్ పదవ తరగతి కి చెందిన మిత్రులు కలిసి 20500* /-( *అక్షరాల ఇరవై వేయ్యుల ఐదు వందల రూపాయలు) ఆర్థిక సహాయం అందించడం జరిగింది . ప్రభుత్వం మరియు సామాజిక* కార్యకర్తలు విజయ కు ఏదైనా పని కల్పించి, డబుల్ బెడ్ రూమ్ మంజూరీ మరియు వర్షిత్ కి గురుకుల స్కూల్ లో సీటు ఇప్పించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ శ్రీమతి కునబోయిన భాగ్యలక్ష్మి -బాలరాజు గార్లు మరియు 2000 బ్యాచ్ పదవ తరగతి మిత్రులు పాల్గొన్నారు.
0 Comments