JSON Variables

మండల బిజేపి పార్టీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు

మండల బిజేపి పార్టీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు 

న్యూస్ పవర్, 9 అక్టోబర్, ఇల్లంతకుంట:
ఈరోజు రామాయణ రచయిత  వాల్మీకి జయంతిని  పురస్కరించుకొని  భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాల్మీకి చిత్రపటానికి  పూలమాలవేసి  జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగింది ఈ సందర్భంగా దళిత మోర్చా మండల శాఖ అధ్యక్షులు ఎలుక రామస్వామి మాట్లాడుతూ ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన వ్యక్తి ఏ విధంగా ఉండాలో శ్రీరాముడు ద్వారా  తెలిపారని ఒక తండ్రికి కొడుగ్గా, భర్తగా, సోదరుడిగా,  తండ్రిగా మరియు తన పాలన ద్వారా రాజ్య ప్రజలు సంక్షేమం కోసం ఏ విధంగా బాధ్యతలు వ్యవహరించలో శ్రీరాముల  ద్వారా గొప్ప సందేశం అందించారు అని, రామాయణ మహా గ్రంధం ద్వారా మానవ  జీవన శైలి ఎలా ఉండాలో వివరించిన ఇంతటి గొప్ప రచయిత వాల్మీకిఅని ,వారి జయంతి సందర్భంగా మండల ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్,పట్టణ శాఖ అధ్యక్షుడు తిప్పారాపు శ్రవణ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు దామర కృష్ణకాంత్,దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న,ఎలుక వర్ధన్,లోకోజ్ చంద్రం,దాసరి శ్యాం, పొట్ల వెంకటేష్, అంతటి వేణు,కుంటాల సాయి, మామిడి శ్రీకాంత్, చింటూ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments