పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌజ్ కార్యక్రమము
న్యూస్ పవర్ , 26 అక్టోబర్ , ఇల్లంతకుంట :
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సై మామిడి మహేందర్ స్థానిక విద్యార్థులకు పోలీసుస్టేషన్‌లో ఆయుధాల గురించి వివరించారు. అనంతరం వారి విధులు, అధికారాల గురించి క్లుప్తంగా తెలియజేశారు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఎలా చేయాలి? ఆయుధాలను ఏలా ఉపయోగించాలి? ఎప్పుడు వాడాలనే విషయాలను తెలియజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అధికారుల గురించి తెలిపారు. పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments