JSON Variables

వీఆర్ఏ. ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

వీఆర్ఏ. ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

   

 న్యూస్ పవర్ , 7 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి  ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ప్రకటించిన అటువంటి పే స్కేల్ మరియు అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పిస్తానని చెప్పి మాటలు దాటవేస్తూ నటువంటి ముఖ్యమంత్రి  వీఆర్ఏలు రెండు నెలల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న మీకు ఏమాత్రం కనికరం అనిపించడంలేదు నిన్న డబ్బులు లేక మన రాష్ట్రంలో పెద్ద పండుగ బతుకమ్మ దసరా పండుగ కు పిల్లలకు బట్టలు లేక నానా ఇబ్బందులు పడ్డ వీఆర్ఏలు ఆదుకునే నాథుడే లేడా రాష్ట్రంలో  రెండు నెలల నుంచి జీతాలు లేక అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్న వీఆర్ఏల ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది నిన్నటి రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్న తాళ్లపల్లి వీఆర్ఏ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు  మీరు ఇచ్చిన మాట ప్రకారం విఆర్ఏలు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు మీరు చేయకపోతే రాబోయే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పసుల వెంకట్ , మండల ప్రధాన కార్యదర్శి అల్లెప్పి రజినీకాంత్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బడుగు లింగం మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి జమాల్ మండల టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి మండల సీనియర్ నాయకులు మచ్చ రాజేశం దాసు సోమారం పేట గ్రామ శాఖ అధ్యక్షులు వడ్డే కోటేశ్వర్ రెడ్డి,   రాజేందర్  రెడ్డి    తదతరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments