JSON Variables

జిల్లా హమాల్ యూనియన్ మూడవ మహాసభలను విజయవంతం చేయండి

జిల్లా హమాల్ యూనియన్ మూడవ మహాసభలను విజయవంతం చేయండి

 న్యూస్ పవర్, 31 అక్టోబర్ , ఇల్లంతకుంట :
జిల్లా హమాల్ యూనియన్ మూడవ మహాసభలను విజయవంతం చేయాలని సావనపల్లి రాములు అమాలి సంఘం మండల అధ్యక్షుడు ఈరోజు మండల కేంద్రం లో అమాలి సంఘ జిల్లా మూడవ మహాసభల కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలాగే అమాలి బోర్డు ఏర్పాటు పై మూడు సంవత్సరాల కాలంలో హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం అలాగే వాటి పరిష్కార కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందని హమాలీ బోర్డు హమ్మాలీలకు హెల్త్ కార్డులు హమాలీలకు ఇన్సూరెన్స్ హమాలీలకు పింఛన్ తదితర డిమాండ్లతో మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుందని అన్నారు ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మరియు హమాలి వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ తదితరులు హాజరవుతున్నారని మండలంలోని ప్రతి అమాలి కార్మికుడు తప్పక హాజరు కావాలని కోరారు
ఈ కార్యక్రమంలో శ్రావణ పెళ్లి ప్రభాకర్ బాబు ఎల్లయ్య నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments