JSON Variables

యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలి

యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలి 

 న్యూస్ పవర్, 31 అక్టోబర్  , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  జాతీయ సేవా పథకం కార్యక్రమంలో నిర్వహించారు  . దీనిలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి. అనంతరం విద్యార్థులతో దేశ ఐకమత్యం, సమగ్ర, భద్రతను కాపాడడానికి అంకితం అవుతామని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింప చేయడానికి గట్టిగా కృషి చేస్తానని  ప్రటిజ్ఞ చేస్తున్నాను, నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నా దేశం అంతర్గత భద్రత ప్రటిష్టపరచడానికి సుయ తోడ్పాటునందిస్తానని తీర్మానం చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మామిడి మహేందర్ మాట్లాడుతూ
‘నా కోసం కాదు, నీ కోసమే..’ అనే దీక్షా నినాదంతో- సేవలు అందించడమే లక్ష్యంగా. యువతలో సామాజిక స్పృహను కల్పిస్తూ, వారిని సేవాభావంతో ముందుకు నడిపించడం నిరంతర కార్యక్రమంగా కొనసాగాలి అని  అన్నారు. ఈ లక్ష్యంతో ఏర్పాటైన జాతీయ సేవా పథకం ఎంతోమంది విద్యార్థులను ఆకర్షిస్తోంది. ఈ పథకంలో చేరిన వారు క్రమశిక్షణ, సామాజిక చైతన్యం కలిగి జీవితంలో ముందుకు రాణించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు కళాశాల ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments