JSON Variables

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్


 న్యూస్ పవర్, 26 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ చిత్ర పటానికి సర్పంచ్ బిలవేని పర్శరాం తో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్,
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ భూమి కోసం , భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రదర్శించిన  తెగువ , పౌరుషం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి తెలియ జేసిన ధీర వనిత ఐలమ్మ అని అన్నారు..సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి , మహిళల చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని అన్నారు.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు..ఐలమ్మ  జయంతి ని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు... ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిలవేని పర్శారాములు , ఉప సర్పంచ్ బత్తిని కావ్య - స్వామి , పంచాయతీ కార్యదర్శి తిరుపతి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తిని మల్లయ్య , వార్డు సభ్యులు దొంతి కవిత - వెంకటేష్,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ , కత్తి బాలయ్య , అంగన్వాడీ టీచర్లు స్వప్న , ఐలవ్వ , సి.ఏ పద్మ మరియు మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments