JSON Variables

మత్స్యకారుల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి - వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

మత్స్యకారుల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి -  వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ 


 న్యూస్ పవర్ , 28 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను గ్రామంలోని చెరువు , కుంటలలో వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్...ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలని కేసీఆర్  చెరువులలో , కుంటలలో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది అని అన్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలాశయాలు చెరువులు నిండు కుండల తయారు అయ్యాయని అన్నారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని కులవృత్తుల వారికి పెద్దపీట వేస్తుందని అన్నారు. వంతడుపుల గ్రామంలో దాదాపు 34 వేల చేప పిల్లలను చెరువు లలో , కుంటలలో వదలడం జరిగింది అని అన్నారు..ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు కేసీఆర్ కి , మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ కి ధన్యవాదాలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో వంతడుపుల గ్రామంలోని రెండు ముదిరాజ్ సంఘాల అధ్యక్షులు , కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments