బాధితురాలు చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని బిజెపి
బొల్లం సాయిరె
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ముక్కుపచ్చలారని ఆరేండ్ల చిన్నారిపై టీఆర్ఎస్ నాయకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన దుర్మార్గం. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు లైసెన్స్ డ్ గూండాలుగా మారిపోయారు. అభంశుభం తెలియని పసిపాప బంగారు భవిష్యత్తును నాశనం చేసిన ముర్ఖుడిని కఠినంగా శిక్షించాలి. టీఆర్ఎస్ పాలనలో పసిపిల్లలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించాను. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులకు బిజెపి అండగా ఉంటుంది .
