పైడి రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన
- హుజురాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడిశెట్టి రాజు
సిద్దిపేట జిల్లా (కోహెడ మండలం) తంగళ్లపల్లి గ్రామానికి చెందిన చాకలి రజక సామాజిక వర్గానికి చెందిన పైడి రాజశేఖర్ గత మూడు రోజుల క్రితం అత్యంత కిరాతకంగా దుర్మార్గుల చేతిలో హత్యకు గురై చనిపోయిన తీవ్ర దుఖఃసగర్వంలో మునిగి ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, రాజశేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా హంతకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని హుజురాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇంతటి బాధాకరమైన విషయం పట్ల ,అమాయకుడైన రాజశేఖర్ పై దాడిని,హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నాము. తీవ్ర దిగ్భ్రాంతి ని,ఆవేదన ను వ్యక్తం చేశారు. రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చెస్తామన్నారు.ఇట్టి సంఘటన పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత పోలీసు అధికారులు డీజీపీ కి పిర్యాదు చేస్తామని రాజు పేర్కొన్నారు.అదేవిధంగా మంత్రి వర్యులు హరీష్ రావు జిల్లా లో అత్యంత బాధాకరమైన, నిరుపేద కుటుంబాన్ని పరామర్శించాలి, ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాజు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అబ్దుల్ల ,జాతీయ బీసీ సంక్షేమ సంఘం రవి, పైడి రాజశేఖర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
