JSON Variables

తడిసిన వడ్లను కొనుగోలు చేయాలి

తడిసిన వడ్లను కొనుగోలు చేయాలి
- కాంగ్రెస్ పార్టీ ప్రధాన రహదారిపై ధర్నా
- తహసిల్దార్ కు వినతి
NEWSPOWER REPORTER:Babu
తడిసిన వరి ధాన్యాన్ని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. డిప్యూటీ తాసిల్దార్ జయంత్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ మండలంలోని ఐకేపీ, సహకార సొసైటీ కేంద్రాలలో అకాల వర్షాలకు వడ్లు పూర్తిగా తడిసిపోయయని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సెంటర్లో 40 కేజీలకు 42 కేజీలు తూకం వేస్తున్నారని,  రైస్ మిల్లుల దోపిడి అరికట్టాలని, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, వెంటనే స్పందించి కొనుగోలు వేగంగా జరపాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులను ఎల్లారెడ్డిపేట ఏ ఎస్ ఐ, శ్రీనివాస్ డిప్యూటీ తహసిల్దార్ జయంతు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ రాస్తారోకోలు గౌస్, లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి,  రాజేందర్, అనవిని రవి,  రెడ్డి మల్ల సత్యం ,గంట బుజ్జి గౌడ్, మానుక నాగరాజ్, కొత్తపెళ్లి దేవయ్య, లచ్చి రెడ్డి, శ్రీకాంత్, నందు, ఇమామ్, సాయి, బాలయ్య రామ్ రెడ్డి,  రాజు, తిరుపురం మహేందర్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments