ఇల్లంతకుంటలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు: ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నివాళులు
ఇల్లంతకుంట, ఏప్రిల్ 05: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, సామాజిక విప్లవకారుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ (MRPS) మండల అధ్యక్షులు మంద రాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మంద రాజు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమాజంలో సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కాసుపాక సురేష్, బొడ్డు వెంకటేశం, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తడికపెల్లి భూమయ్య, ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మంద రవి పాల్గొన్నారు.
అలాగే ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండేటి రాజు, రెడ్డి సంఘాల నాయకులు బద్దం హనుమంత్ రెడ్డి, పోచమ్మ టెంపుల్ చైర్మన్ కొలపురి అంతగిరి, రాగటి రమేష్, పున్ని రాజేశం, ఎలుకపెల్లి కుమార్, మంద ఆంజనేయులు తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు.
