రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సోమారంపేట విద్యార్థిని
• నిత్యను ఘనంగా సత్కరించిన పోరెడ్డి సుమంత్ రెడ్డి, కాచం సురేందర్ రెడ్డి, భాను.
• విద్యార్థులకు అండగా ఉంటామని హామీ
న్యూస్ పవర్, 15 జనవరి , ఇల్లంతకుంట:
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ సోమారంపేట గ్రామానికి చెందిన విద్యార్థిని నిత్య రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆమెను గ్రామనికి చెందిన పోరెడ్డి సుమంత్ రెడ్డి, కాచం సురేందర్ రెడ్డి, భాను శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.కబడ్డీ సంబంధించిన కిట్ నిత్యకి అందజేస్తామని హామీ ఇచ్చారు ,
సోమారంపేట గ్రామానికి చెందిన మూడపెల్లి సంపత్ కుమార్తె నిత్య, రహీంఖాన్ పేట మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పోరెడ్డి సుమంత్ రెడ్డి, కాచం సురేందర్ రెడ్డి, భాను మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ప్రతిభ గల విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి, క్రీడల్లో మరియు చదువుల్లో రాణించడానికి తమ వంతు అవసరమైన సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తామని వారు తెలిపారు.
