అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు జెసిబి సీజ్
న్యూస్ పవర్ , 12 జూలై , ఇల్లంతకుంట :
అక్రమంగా వరద కాలువ మట్టి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు మరియు జెసిబి సీజ్ చేసినట్లు
ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు
గాలిపెళ్లి శివారు లోని వరద కాలువ పక్కన ఉన్నటువంటి మట్టి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను మరియు ఒక జెసిబి ఇల్లంతకుంట పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో ట్రాక్టర్లను మరియు జెసిబి ని పట్టుకొని మట్టి తరలించుటకు ఎటువంటి అనుమతి పత్రాలు చూపించినందున ఆ యొక్క నాలుగు ట్రాక్టర్లను మరియు జెసిబిని సీజ్ చేశారు,
ఎవరు కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు భూమిలో తవ్వకాలు మరియు మట్టి తరలింపు జరుపుటకు సంబంధిత శాఖల వద్ద అనుమతి తీసుకోవాలి లేనిచో వారిపైన చట్ట ప్రకారం వాహనాలు సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు .