ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటుకు కేరళ మోడల్ ప్రవేట్ పాఠశాల ప్లెక్సీలు



 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటుకు కేరళ మోడల్ ప్రవేట్ పాఠశాల ప్లెక్సీలు

 • ఇల్లంతకుంట కేరళ మోడల్ హై స్కూల్ గుర్తింపు రద్దు చెయ్యాలి, పాఠశాల యాజమన్యం పై తగిన చర్యలు తీసుకోవాలి

• ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

ఇల్లంతకుంట మండలంలోని తాళ్ళపెల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల గేట్ కి ఇల్లంతకుంట "కేరళ మోడల్ హై స్కూల్ " ప్లెక్స్ కట్టడం పై స్పందించని అధికారులు. 
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కేరళ మోడల్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాలలు టార్గెట్ గా విద్యార్థులను చెరుపించుకుంటున్న పరిస్థితి అన్నారు. ప్రభుత్వాలు మారుతున్న ఈ ప్రవేట్ పాఠశాల యాజమాన్యం తీరు మాత్రం మార్చుకోవటం లేదు. అధికారులు చెప్పిన పట్టించుకోకపోవటం విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తిస్తారు అని యాగ్దేవ చేశారు. పలు మార్లు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అప్పటిమందేమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో యూనిఫామ్స్, బుక్స్ అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు. తక్షణమే కేరళ మోడల్ స్కూల్ తగిన చర్యలు తీసుకోని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరో సారి ప్రవేట్ , కార్పొరేట్ పాఠశాలలు ఇలా వ్యవహరిస్తే పాఠశాల పై భౌతిక దాడులకు వెనుకడము అని హెచ్చరించారు.

Post a Comment

0 Comments