కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత
న్యూస్ పవర్ , 23 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని తెనుగువాండ్లపల్లె పాడిరైతు గొడుగు రాజమల్లయ్య-లక్ష్మీ కూతురు రవళి వివాహానికి పుస్తేమట్టెలు అందజేసిన కరీంనగర్ డెయిరీ సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి.ఈ సందర్భంగా గుర్రం సతీష్ రెడ్డి మాట్లాడుతు కరీంనగర్ డెయిరీ రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా కళ్యాణమస్తు పథకం ద్వారా ఆడబిడ్డ పెళ్ళికి పుస్తే మట్టెలు అందజేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు ఏం.బాలమల్లు,కార్యదర్శి నవీన్, రెైతులు తదితరులు పాల్గొన్నారు.
