JSON Variables

దుద్ధిల్ల శ్రీపాద రావు సేవలు చిరస్మనియం

దుద్ధిల్ల శ్రీపాద రావు సేవలు చిరస్మనియం

• మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూంపల్లి రాఘవ రెడ్డి

న్యూస్ పవర్ , 13 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా  ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ &ప్రైవేటు ఆసుపత్రులలో పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ దుదిల్ల శ్రీపాద రావు మారుమూల ప్రాంతంలో పుట్టి సర్పంచ్ స్థాయి నుండి మంథని శాసనసభ్యునిగా మూడు పర్యాయాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా సేవలందించిన వ్యక్తిగా ఆయనను కొనియాడుతూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకన్న, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలపోచయ్య, సీనియర్ నాయకులు కర్ణాకర్ రెడ్డి,బడుగు లింగం మైనరిటీ అధ్యక్షుడు జమాల్, ఎస్ సి సెల్ అధ్యక్షుడు మచ్చ రాజేశం,బడుగు లింగం,సురేందర్ రెడ్డి అనిల్,యాస తిరుపతి, మల్లయ్య,సంపత్ రెడ్డి, చంద్రమౌళి, ఆంజనేయులు, రాజు, రవి, దాసు, కుమార్,రేగుల కార్తీక్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఒగ్గు మధు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్,శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments