JSON Variables

విద్యార్థుల మౌలిక వసతుల కల్పనకు కృషి

విద్యార్థుల మౌలిక వసతుల కల్పనకు కృషి
న్యూస్ పవర్ , 9 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే  డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ  ఎమ్మెల్యేగా గెలుపొంది, మొదటిసారిగా ఇల్లంతకుంట హైస్కూల్ కు విచ్చేసిన సందర్భంగా, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు బోరు మంజూరు చేయమని అడగడంతో, ఎమ్మెల్యే  స్పందించి శుక్రవారం బోరు వేయించాలని చెప్పడంతో  ఎంపీపీ ఇల్లంతకుంట మండల కేంద్రంలోనీ హైస్కూల్లో కొబ్బరికాయ  కొట్టి బోరును వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ  వుట్కూరి వెంకట  రమణా రెడ్డి  మాట్లాడుతూ  ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ  విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తారని, ప్రజాసంక్షేమమే ఆయన ధ్యేయంగా పనిచేస్తారని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, కార్యదర్శి వరుణ్, తుంకుంట మోహన్ రెడ్డి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments