JSON Variables

నిరుపేదల ఇల్లు ఖాళీ చేయించవద్దు

నిరుపేదల ఇల్లు ఖాళీ చేయించవద్దు

న్యూస్ పవర్ , 5 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉన్న నిరుపేదలను ఖాళీ చేయించవద్దని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగన్నేరం నర్సయ్య ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేశారు గత ఎనిమిది సంవత్సరాల క్రితం పెద్ద లింగాపుర్ గ్రామంలో నిరుపేదల కోసం అప్పటి ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల గత కొద్ది రోజులుగా లబ్ధిదారులు ఎదురుచూసిస్థానిక సర్పంచ్  దృష్టికి తీసుకుపోగా కొన్ని చిన్న చిన్న పనులు పూర్తి చేయడం జరిగింది అని ఆ పనులు పూర్తయిన వెంటనే పంపిణీ సిద్ధం చేసే లోపే ఎలక్షన్ రావడం వల్ల కొంచెం జాప్యం జరిగిందని అధికారులు చెప్పడం జరిగిందని ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్లీ పంపిణీ చేస్తారని ఎదురు చూసిన లబ్ధిదారులు పంపిణీ చేయకపోవడంతో ఆదివారం రాత్రి గతంలో వారికి గ్రామ సభలో కేటాయించిన ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉండడం జరిగింది సోమవారం ఉదయం రెవెన్యూ మరియు పోలీస్ శాఖ వారు గ్రామానికి వచ్చి మీకు అధికారికంగా ఇల్లు పంపిణీ చేస్తాం కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేయాలని కోరగా గత ఎనిమిది సంవత్సరాలుగా మేము నిరీక్షిస్తున్నా దయచేసి మమ్మల్ని ఖాళీ చేయవద్దని వేడుకోవడం జరిగిందని ఆయన అన్నారు ఇప్పటికైనా అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు స్పందించి గతంలో వారికి కేటాయించిన ఇళ్లల్లో వారిని ఉండనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు
.

Post a Comment

0 Comments