JSON Variables

గడప గడప కి బీజేపీ ప్రచారం

గడప గడప కి బీజేపీ ప్రచారం 

 న్యూస్ పవర్ , 20 నవంబర్ , ఇల్లంతకుంట :
మానకొండూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెపల్లి మోహన్ గెలుపే లక్ష్యంగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో గడప గడప కి బీజేపీ కార్యక్రమంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్ట్ ప్రజా సంక్షేమ పథకాలు, విజయాలను విస్తృతంగా ప్రచారం చేశారు. మేనిఫెస్టోలో రైతన్నలకు మేలు చేకూరేలా వడ్లకు కనీస మద్దతు ధర 3100/- అంశాన్ని వివరించి రైతులకు స్వీట్ పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన  ఆయస్మాన్ భారత్ , ఉచిత ఎరువులు, బేటీ బచావో, ప్రధానమంత్రి జన్ ధన్, సుకన్య సమృద్ధి యోజన,మహిళలకు హక్కులు కల్పన మరియు ప్రధాన మంత్రి ముద్రా యోజన వంటి ఆర్థిక చేరిక పథకాలతో పాటు మేనిఫెస్ట్ ప్రజా సంక్షేమ పథకాలు, వివరించారు. మోడీ నాయకత్వంలో తెలంగాణ లో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అదే దిశలో మానకొండూర్ నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెపల్లి మోహన్ కి ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను కోరారు
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, మండల ప్రధాన కార్యదర్శులు తిప్పారపు శ్రావణ్, వజ్జేపల్లి శ్రీకాంత్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, మండల దళిత మోర్చా అధ్యక్షుడు మామిడి శేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు మ్యాకాల మల్లేశం, శక్తి కేంద్రం ఇంచార్జి లొంకోజు చంద్రం, బీజేపీ నాయకులు ఎగుర్ల బీరయ్య, వికృతి శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.

              

Post a Comment

0 Comments