JSON Variables

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపుపై కేసు నమోదు


నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపుపై కేసు నమోదు

• బెల్టు షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు_ఎస్ఐ సుధాకర్

 న్యూస్ పవర్, 8 నవంబర్ , ఇల్లంతకుంట :
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపు పైన కేసు నమోదు చేయడం జరిగిందని ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలోని డాబాలో బెల్ట్ షాపు నిర్వహిస్తూ అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు నిన్న రాత్రి పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని మద్యాన్ని అమ్ముతున్న షేరు.ఏళ్ళం షాపులో నుండి 24 బీర్ బాటిళ్లు మరియు నాలుగు లీటర్ల మద్యం సీజ్ చేసి అతనిపైన కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఎవరైనా మద్యాన్ని విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు ప్రభుత్వ అనుమతి పొందిన వైన్ షాపులు కాకుండా బయట ఎక్కడైనా మద్యాన్ని అక్రమంగా విక్రయించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అటువంటి వారి సమాచారాన్ని పోలీసువారికి అందించాలని కోరారు. అక్రమంగా మద్యాన్ని విక్రయించిన షేరు.ఎల్లం ను బైండోవర్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అక్రమ మద్యాన్ని పట్టుకున్న కానిస్టేబుల్ లు అనిల్, మధు లను ఎస్సై అభినందించారు.

Post a Comment

0 Comments