JSON Variables

తెలంగాణ రాష్ట్రాన్నిచ్చినకాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇవ్వండి

తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన
కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇవ్వండి


• పథకాలు నెరవేర్చని బీఆరెస్ ను తరిమికొట్టండి
• మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.కవ్వంపల్లి సత్యనారాయణ

న్యూస్ పవర్ , 8 నవంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా,  ఇల్లంతకుంట మండల కేంద్రంలో మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొని మాట్లాడుతు గత పదిసంవత్సరాల నుండి రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం, మానకొండూర్ నియోజకవర్గాన్ని రసమయి బాలకిషన్ దోచుకుంటున్నారని, రాష్ట్రంలో నయా నిజాం కేసిఆర్ ను , మానకొండూర్ లో దగా కోర్ రసమయి ని తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రసమయి పాలనలో ఒక పభ్రుత్వ డిగ్రీకళాశాల గాని, జూనియర్ కళాశాల గాని తీసుకరాని అసమర్ధుడని స్థానికేతర ఎమ్మెల్యే రసమయిని తరిమి కొట్టి, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మీకోసం పనిచేస్తానని తెలిపారు. పది సంవత్సరాలు రాష్టంలో బిఆర్ఎస్ పార్టీకి అధికారమిచ్చారు ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండని తెలిపారు.
పేదలకు భూములు ఇవ్వాలన్నా, ఇండ్లు కట్టించలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా  కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిందేనని బీఆరెస్ దళిత బంధు, బీసీ బంధు ఇయ్యలే డబల్ బెడ్ రూమ్, గృహలక్ష్మి ఇయ్యలేదని
అన్నీ బంద్ చేసిన సర్కార్ ను కూడా నవంబర్ 30 తేదీన బంద్ చేద్దామని తెలిపారు.
ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు వచ్చే జీతాన్ని కూడా మానకొండూర్ నియోజకవర్గంలో
గ్రంధాలయల ఏర్పాటు కోసమే ఉపయోగిస్తాను….
అనంతరం వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు యువకులు కవ్వంపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి  జన్మదిన సందర్బంగా మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాఘవరెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు,మండల  కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కుల సంఘాల నాయకులు, గ్రామ సభ్యులు ,వార్డు సభ్యులు, అనుబంధాల శాఖ నాయకులు,యువకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments