చిరు సంచి దశలో ఉన్న వరి వంగడాలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం

చిరు సంచి దశలో ఉన్న వరి వంగడాలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం


 న్యూస్ పవర్ , 3 నవంబర్ , ఇల్లంతకుంట:
 జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని పొత్తురు గ్రామానికి చెందిన చెరకు రవీందర్ రెడ్డి అనే రైతు పొలంలో సాగు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన చిరుసంచి దశలో ఉన్న వరి వంగడాలను (దొడ్డు గింజ రకాలైన జె.జి.ఎల్.-28639, డబ్ల్యు.జి. ఎల్. 1537
మరియు ఆర్.ఎన్.ఆర్.-28361 మరియు సన్న గింజ రకమైన ఆర్.ఎన్.ఆర్.-31479) శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రూపొందించబడిన అధిక దిగుబడినిచ్చే నూతన వరి వంగడాలను రైతులు ప్రోస్తహించాలని తద్వారా రైతులు మంచి ఫలితాలు పొందాలని రైతులకు సూచించారు. ఈ క్షేత్ర సందర్శనలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ సీనియర్ సైంటిస్ట్ డా. సతీష్ చంద్ర, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలస, జగిత్యాల సీనియర్ సైంటిస్ట్ డా. శ్రీనివాస్ మరియు సైంటిస్ట్ డా. గొన్యనాయక్, వ్యవసాయ పరిశోధన స్థానం, కునారం సీనియర్ సైంటిస్ట్ డా. శ్రీదర్ సిద్ది, జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి, శాస్త్రవేత్త డా. ఎమ్. రాజేంద్ర ప్రసాద్ మరియు మండలం వ్యవసాయ విస్తరణ అధికారి లత శ్రీ మరియు రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments