కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
జనం న్యూస్ , 1 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని ఎర్రనర్సుపల్లి గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్,బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువాలు కప్పి మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగ హామీలను ఎవరు నమ్మబోరని, బీజేపీ పార్టీకి క్యాడర్ లేదన్నారు.
తెలంగాణ లో మూడవ సారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎర్పాటు కాబోతుందన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని అన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరని అన్నారు.
తెలంగాణ ప్రజలు సారూ..కారూ..సర్కారు అనే నినాదంతో ఉన్నారని.. బీఆర్ఎస్ తోనే పేదల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.
0 Comments