JSON Variables

మహాత్ముడు కళలుకన్నా గ్రామ స్వరాజ్యం కేసీఆర్ సాకారం చేస్తున్నారు

మహాత్ముడు కళలుకన్నా గ్రామ స్వరాజ్యం కేసీఆర్ సాకారం చేస్తున్నారు


• జిల్లా పరిషత్ వైస్ చైర్మన్  సిద్ధం వేణు

న్యూస్ పవర్ , 2 అక్టోబర్ , ఇల్లంతకుంట:
గాంధీ జయంతి సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో  మహాత్ముడి  విగ్రహానికి జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పూలమాల వేసి నివాళులర్పించారు. 
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాట్లాడుతూ మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు  కోట్లాది మంది ప్రజలు కుల, మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి గాంధీ అని అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని చెప్పారు. దేశానికి స్వేచ్చ కోసం కుల,మతాలకు అతీతంగా అందరూ పోరాడారని గుర్తు చేశారు.
మహాత్మా గాంధీ అందించిన అహింస ఉద్యమం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు.
మహాత్మాగాంధీ అడుగుజాడల్లో మనమంతా నడవటమే మనం మహాత్ముడి కి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  సారధ్యంలో నెరవేరిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి ఛైర్మన్ సంజీవ్,సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, ఎంపీటీసీ ఓగ్గు నర్సయ్య యాదవ్, ఉప సర్పంచ్ ఎండి సాదుల్ కొ ఆప్షన్ సభ్యుడు ఎండీ సలీం, వార్డు సభ్యులు అంతగిరి భాస్కర్,మామిడి తిరుపతి,రమేష్ సింగ్ ,పుష్పలత,రాజు,రవీందర్ రెడ్డి, అమరు బాలయ్య, పంచాయతి సెక్రటరీ వరుణ్, నాయకులు వేణు సెట్, అప్పాయ్య సెట్, రంకిషన్ సెట్, మురళీ సెట్, కోటే వెంకన్న,రఘు, తెలంగాణ శ్రీనివాస్, లక్ష్మణ్, పర్షరం,ఆంజనేయులు, ఏలోజి దుర్గయ్య, బాలయ్య, శ్రీను, హరికుమార్, నర్సయ్య, రాము తదితులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments