JSON Variables

ఋణ రాయితీ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దరఖాస్తుల స్వీకరణకు ఆహ్వానం

ఋణ రాయితీ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దరఖాస్తుల స్వీకరణకు ఆహ్వానం

న్యూస్ పవర్ , 14జూలై , సిరిసిల్ల:తెలంగాణ రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ ఆదేశాల మేరకు గౌరవ  జిల్లా కలెక్టర్  గారి అనుమతితో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో పుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజేస్ (PMFME) స్కీం లో భాగంగా  35% ఋణ రాయితీతో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు  ఋణాల మంజూరు కొరకు దరఖాస్తుల స్వీకరణకు  తేది: 17-07-2023 (సోమవారం) నుండి ఆహ్వానిస్తున్నామని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కే. ఉపేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, స్వయం సహాయ సంఘాలు , రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రైవేట్ ఆహార పరిశ్రమలు, స్వచ్చంద సంస్థలు , గ్రామీణ యువత మరియు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని విజ్ఞప్తి చేసారు.తమ ధరఖాస్తును పూర్తి వివరాలతో ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, కరెంట్ బిల్లు, యూనిట్ యొక్క సంబంధించిన వివరాలతో తమ దరఖాస్తును జిల్లా పరిశ్రమల కేంద్రం, సమీకృత జిల్లా అధికారుల సముదాయంలో సమర్పించవలసిందిగా జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్  కే. ఉపేందర్ రావు తెలిపారు.




Post a Comment

0 Comments