JSON Variables

జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి

*జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి*
  - మారుపాక అనిల్ కుమార్ ప్రెసిడెంట్

• అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం ఇవ్వాలి

•పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించిన జర్నలిస్టులు
జనం న్యూస్ , 29 జూలై , ఇల్లంతకుంట :
రాష్ట్రంలో జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని టి యు డబ్ల్యూ జే ఐ జేయు ఇల్లంతకుంట మండల అధ్యక్షులు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు,
రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు ఈరోజు మండల కేంద్రంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు,
ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు మండల అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు ముఖ్య భూమిక పోషించారు. అలాంటి జర్నలిస్టులు నేడు స్వరాష్ట్రంలో ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో సత్వరమే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టు హెల్త్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు అంతే కాకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు,
ఈ కార్యక్రమంలో తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ఎర్రోజు రాజేందర్,ఏనుగుల మహేందర్, రాకం సుమన్, సాదుల నిరంజన్,పెద్దురి శ్రీనివాస్, వడ్డీక అనిల్, గుండ రవీందర్, కత్తి బాలయ్య, ఏనుగుల మహేందర్, తాడురి స్వామి, కందారం అంజనేయులు, జక్కుల శ్రీనివాస్ , ర్యగరి మహేందర్,  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments