JSON Variables

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదప్రజల పాలిట వరం

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదప్రజల పాలిట వరం
-జెడ్పి వైస్ చైర్మన్ సిద్దం వేణు
జనం న్యూస్ , 27 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
ముఖ్యమంత్రి సహాయనిధి పేదప్రజాలకు వరమని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు అన్నారు, ఇల్లంతకుంట మండలం పోత్తురు గ్రామంలో ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి మంజూరైన గుంటి బాలవ్వ 60వేలరూపాయలు,బండారి మమత,12వేలరూపాయలు, ర్యగటి అజయ్13500
 రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు, అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేద ప్రజల పాలిట వరంగా మారిందని ప్రతి ఒక్కరికి సహాయం అందుతుందని వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని అన్నారు, అలాగే మండలంలోని వందలాది మంది పేదలకు వైద్య సేవల నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించామని అన్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ఎంపీటీసీ పట్నం అశ్వని శ్రీనివాస్, ,పాక్స్ డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ బండారి పరుశురాములు సిద్ధం నరసయ్య, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శి వార్డు సభ్యులు నాయకులు  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments