JSON Variables

చలో హైదరాబాద్ విజయవంతం చేయండి

 చలో హైదరాబాద్ విజయవంతం చేయండి 
 - హమాలీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సావనపెల్లి రాములు
జనం న్యూస్ , 26 ఏప్రిల్ , ఇల్లంతకుంట : 
ఏప్రిల్ 29న చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని ముస్కాన్ పేట గ్రామంలో ఈరోజు వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది, ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూహమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే ప్రతి హమాలి కార్మికునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో హమాలీలకు రైతులతో కాకుండా ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న అమాలి కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని  హమాలి కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన ప్రతి హమాలి కార్మికునికి నెలకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో హైదరాబాదులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతుందని ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి హమాలి కార్మికుడు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రతి హమాలి కార్మికుడు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చిరవేణి అంజి జుట్టు బాబు దాసరి రమేష్ పరుశరాములు మచ్చ నర్సయ్య రాజు కనకయ్య రాజయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments