స్కాలర్షిప్స్ విడుదల చేయాలి అని
ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన ఏబీవీపీ నాయకులు
- ఏ రోజు కూడా విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్స్ విడుదల చేయడం లేదు
- ప్రయివేట్ కళాశాలలు విద్యార్థులను స్కాలర్షిప్స్ రాక విద్యార్థుల నుండి వసూలు
- స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తాం
- ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు
న్యూస్ పవర్, 4 మార్చి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల ఎబివిపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 5.500 కోట్లు రూపాయలు స్కాలర్షిప్స్ విడుదల చేయాలి అని
ఎంఆర్ఓ రవికాంత్ కు వినతి పత్రం ఇచ్చిన నాయకులు
ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర లో విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్స్ ఇవ్వలేని దుస్థితి లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ధనిక రాష్ట్ర అని చెప్పుకోవడమే గాని ఏ రోజు కూడా విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్స్ విడుదల చేయడం లేదు అనివిద్యార్థులు తీవ్ర ఇబ్బదులకు గురి అవుతున్నారు అని అలాగే ప్రయివేట్ కళాశాలలు విద్యార్థులను స్కాలర్షిప్స్ రాక విద్యార్థుల నుండి వసులు చేస్తున్నారు అని ఇప్పటికి అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్స్విడుదల చేయాలి అని లేని పక్షం లో రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో టౌన్ సెక్రటరీ కూనబోయిన ప్రవీణ్, వొళ్ళలా మధు, చొప్పరి అనిల్, చొప్పరి సునీల్, వొళ్ళలా ప్రశాంత్, ఎల్క ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments