JSON Variables

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి


ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

  - దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి  మామిడి హరీష్

న్యూస్ పవర్ , 18 మార్చి , ఇల్లంతకుంట :
ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేయడం విస్మయం కల్పిస్తుందని దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి  మామిడి హరీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద దళిత కుటుంబాలకు దళిత బంధు అందించి ఆర్థిక చేయూత కల్పిస్తామని  హామీ ఇచ్చిన రసమయి అసత్యపు హామీలతో రాజకీయ పబ్బం గడుతున్నాడని ఎద్దేవాచేశారు.మండలంలొ అభివృద్ధి కుంటుపట్టిందని వివిధ గ్రామాలకు సరియైన రోడ్లు సౌకర్యం లేక, రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయకుండా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మంచి నీరు కూడా అందించలేని దుస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. మూడెకరాల భూమి, దళిత బంధు, రుణమాఫీ లాంటి హామీల పట్ల ప్రజల నుండి వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే లబ్ధిదారుల వద్దకు వెళ్తూ, అసత్యపు హామీలు ఇచ్చి మేకపోతు గాంబిరాన్ని చూపిస్తూ పబ్బం గడుపుతున్నాడన్నారు. ఇప్పటికైనా దళిత బంధు అందేలా చర్యలు చేపట్టాలని లేని యెడల తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నామన్నారు.


Post a Comment

0 Comments