JSON Variables

మోడల్ స్కూల్ కి రోడ్డు వెయ్యలని ఏం అర్ ఓ ఆఫీస్ వరకు పాదయాత్ర

మోడల్ స్కూల్ కి రోడ్డు వెయ్యలని ఎం అర్ ఓ ఆఫీస్ వరకు పాదయాత్ర

 న్యూస్ పవర్ , 22 అక్టోబర్, ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో
 ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో  మండలంలోని రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ నుండి ఏం అర్ ఓ ఆఫీస్  07 కి. లో. మీ. వరకు ఎస్ ఏఫ్ ఐ నాయకులు, ఆటో యూనియన్ సభ్యులు పాదయాత్ర చెయ్యటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఏర్పాటు ఐన అనంతరం పాఠశాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలి అప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించిన పరిస్థితి. ఇప్పుడు రోడ్డుకి కేటాయించిన భూమి గతంలో నీటి ఒర్రె గా ఉండేది అని సమాచారం, అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పటికే పరిమితం అనే విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టకుండా చేతులు దులుపుకున్నరన్నారు. గతంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని 2017 సం"లో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల, ఆటో యూనియన్ సభ్యులను కలుపుకొని రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహిస్తే అప్పుడు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్, ఎంపీటిసి జోక్యం చేసుకొని ధర్నా విరమించుకోవాలని ఇబ్బందులు పెట్టినప్పటికి విరమించకపోవటం స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎంపీ వినోద్ కుమార్ , ఎస్ఎఫ్ఐ 6 మంది నాయకుల పై అక్రమ కేసులు పెట్టించరు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తిసుకెళ్లిన పట్టించుకోవటం లేదు చాలా సార్లు పాఠశాల ప్రిన్సిపాల్, మాజీ పాఠశాల చైర్మన్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు ఏం అర్ ఓ కి రాతపూర్వకంగా, వినతి పత్రం లు ఇవ్వడం జరిగింది. కానీ సర్వే చేస్తున్నాం అంటు సమయం వృధా చేస్తున్నారు వర్షం వస్తే ఆటోలు పోలేని పరిస్థితి కనీసం విద్యార్థులు నడుచుకుంటూ వెల్లలంటేనే బయపడుతున్నారన్నారు. గతంలో రెండు ఆటోలు పోయే అంత ప్లేస్ ఉండేది ఈ సంవత్సరం ఒక్క ఆటో ఇరుకుగా పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యార్థుల సమస్యలు అంటే ప్రజాప్రతినిధులకు అవసరం లేదు అనుకుంటా ఎందుకంటే వారికి ఓటు హక్కు ఉంటే ఓటు కోసం అయిన పని చేసేవారు ఏమో అనుకుంటున్నామన్నారు. ఇక్కడ అభివృద్ధి చెయ్యలేను వారు వేరే నియోజకవర్గంకు వెళ్ళి ఎం అభివృద్ధి చేసాం అని చెప్పుకుంటరో చెప్పాలని ప్రశ్నించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాతో పాటుగా రోడ్డు సమస్య పరిష్కారం కోసం ఉద్యమించటానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఏం అర్ ఓ రావికాంత్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ పాదయాత్రతో  ఐన ప్రజాప్రతినిధులు త్వరగా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎస్ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను,తల్లిదండ్రులను,ఆటో డ్రైవర్లు లను కలుపుకొని కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం, ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో ముందు ధర్నా, రాస్తారోకో లు ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తాం అని హెచ్చరించారు.  పాదయాత్రకు మద్దతుగా సిపిఎం మండల ఇంఛార్జి గన్నేరం నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు పసుల వెంకటి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ మనకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లే ఇక్కడి అభివృద్ధి గురించి పట్టిచుకోకుండా ఇక్కడ అభివృద్ధి కి కేటాయించిన నిధులు తీసుకొల్లి మునుగోడు లో ఖర్చు చేస్తామని నీతులు చెప్తున్నారన్నారు. 700 మంది విద్యార్థులు ఉన్న మోడల్ స్కూల్ కి రోడ్డు వెయ్యనికి నిధులు లేవు కానీ గుండారంలో ఉన్న ఎమ్మెల్యే అతిధిగృహం సిసి రోడ్డు వేసుకుంటానికి ఉంటాయా అని ప్రశ్నించారు, ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం చేపట్టాలని హేంచరించారు.
కార్యక్రమంలో  స్వేరో నాయకులు జేరిపోతుల సాగర్,తాండ్ర శివగణేష్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు వంశీకృష్ణ, పెండెల ఆధిత్య, పందుల రాంచరణ్, చిగుర్ల అనిల్  కుమార్, వెంకటేష్,రుద్ర,అభిషేక్, మోడల్ స్కూల్ ఆటో యూనియన్ సభ్యులు రవి,రాములు,అక్షయ్ తదితరులు  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments