JSON Variables

సమస్యలను పక్కన పెట్టి ఎమ్మెల్యే ల కొనుగోళ్లలో బిజీ అయిన తెరాస & బీజేపీ

 సమస్యలను పక్కన పెట్టి  ఎమ్మెల్యే ల కొనుగోళ్లలో బిజీ అయిన తెరాస & బీజేపీ


 న్యూస్ పవర్  , 28 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  పసుల వెంకటి  ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది
యావత్ తెలంగాణ రైతాంగం ఎడతెగని వర్షపాతములో పంటలు వేయగా తెగుళ్లు, పురుగులు, నకిలీ విత్తనాలతో పోటీపడి సాగుచేసి వరి ధాన్యం కోతలు జరుగుతున్న వేళా, పత్తి పంట చేతికొస్తున్న వేళా, మునుగోడులో గెలిచేదెవరో ఓడేదెవరో పక్కన బెడితే.. ఈ ఒక్క సీటుతో ఏ పార్టీకి ఒరిగేదేమి లేదు.. పోయేదేమీలేదు కేవలం రాజకీయ బల నిరూపణ మాత్రమే... ఆ బలనిరూపణకు కోట్లకొద్దీ డబ్బులు కుమ్మరిస్తూ ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా అంగట్లో బర్లను , గొర్లను కొన్నట్లు ఓటర్లను, ప్రజాప్రతినిధులను, ఎం.ఎల్.ఏ లను, ఎంపీలను కొంటున్నారు. డబ్బులు లేనివాళ్లు, నిజాయితీపరులు. ప్రజా సేవకులు రాజకీయాలకు పనికిరారు అన్నట్లు నిరూపిస్తున్నారు. రైతులను ఉద్దరించామని కేవలం కంటితుడుపు రైతుబందు, పీఎం కిసాన్ మాత్రమే ఇచ్చి కోట్ల ఖర్చుతో ప్రకటలను ఇచ్చుకుంటున్నాయి. ఒకపక్క ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతూ వాటిని మైమరపించేలా చేసి, దృష్టిని మరలించేందుకే  ఈ పార్టీల కొనుగోళ్ల బాగోతాలు, అభివృద్ధి చూసి పార్టీమారుతున్నామని, పార్టీలో న్యాయం లేదని సాకులు చెప్పి తమకు తాముగా వేలం వేసుకుంటున్న నాయకులు. గత ఎనమిది ఏండ్లలో ప్రతి ఎం.ఎల్.ఏ, ఎంపీల ఆస్థులు -అంతస్థులు చూస్తే తెలుస్తుంది. రాజకీయం సేవకాదు.. జూదము, ప్రజాసేవ కాదు - వ్యాపార మార్గం అని నిరూపిస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సెంటుమెంట్ల పెట్టుబడి, మందు సీసాల అలజడి, రంగు నోట్ల అలికిడి ఎవరికీ ఎక్కువ ఉంటాయో వారే విజేతలు.. ఈ రాజకీయ రంగస్థలములో నాటకం  రక్తికట్టిస్తున్న అది నిజం కాదు.. కేవలం నటననే అని ప్రజలు త్వరలోనే గ్రహిస్తారు.. అప్పుడు ముఖానికి ఉన్న వెలిసిపోక తప్పదు.. అసలు రంగు బయటపడక తప్పదు,  కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అల్లేపు రజినీకాంత్ మండల బిసి సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం ఎస్సి సెల్ అధ్యక్షులు బడుగు లింగం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్ సీనియర్ మండల నాయకులు గొల్ల కుంటి బాలయ్య మచ్చ రాజేశం గూడ నరేందర్ రెడ్డి ఆవుల శ్రీనివాస్ ఎట్ల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments