JSON Variables

ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీర - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీర - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

 న్యూస్ పవర్,  26 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడ బిడ్డలకు బతుకమ్మ కానుక గా అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ బిలవేని పర్శారాములు తో కలిసి ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ప్రారంభించారు,
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుకగా చీరలను అందిస్తుంది అని అన్నారు.. బతుకమ్మ పండుగ సారెగా చీరలను పంపిణీ చేస్తుంది అని అన్నారు. పేదింటి ఆడబిడ్డల మొఖం లో చిరునవ్వు చూడాలని కేసీఆర్  ప్రతి ఆడబిడ్డ కి పుట్టింటి కానుకగా చీరలను పంపారు అని అన్నారు.. తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలను , మతాలను సమానంగా చూస్తుందని అన్నారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిలవేణి పర్శరాములు , ఉప సర్పంచ్ బత్తిని కావ్య - స్వామి , పంచాయతీ కార్యదర్శి తిరుపతి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తిని మల్లయ్య , వార్డు సభ్యులు దొంతి కవిత - వెంకటేష్,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ , కత్తి బాలయ్య , అంగన్వాడీ టీచర్లు స్వప్న , ఐలవ్వ , సి.ఏ పద్మ మరియు మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments