JSON Variables

బిజెపి నాయకుల రాస్తారోకో

బిజెపి నాయకుల రాస్తారోకో
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల రాష్టంలో దళిత బందు  ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చి 7 నెలలు గడిచిపోతున్న ఇంకా  దళిత బందు ఇవ్వకపోవడంతో  రాస్తా రోకా చేసిన ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులు తెలంగాణా రాష్ట్రములోనీ ప్రతి  దళిత కుటుంబనికి దళిత బందు ద్వారా 10 లక్షలు రూపాయలు నవంబర్ 4 తేది నుండి ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేటికి 210రోజులు గడిచిపోతున్న దళిత బందు ఇవ్వకపోవడంతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాస్తా రోకా చేస్తూ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ మామిడి హరీష్ మాట్లాడతూ..  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  మానకొండూర్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు రూపాయలు చొప్పున దళిత బందు అందించాలని,ప్రతి నెల 4 వ తేదీన  నిరసన కార్యక్రమాలు చేస్తూన్నా, దళిత బందు అందించకుండా,నియోజకవర్గ దళిత సోదరులను మోసం చేస్తూ దళిత ద్రోహి  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,నియోజకవర్గంలో దళిత బందు ఇవ్వకుండ దళితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎమ్మెల్యే రసమయి వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నారు,మండలనికి ఒక చిన్న పల్లెకు దళిత బందు ఇచ్చి మిగతా దళితులకు సున్నం పెడ్తామంటే చూస్తూ ఊరుకునేదిలేదనీ మండిపడ్డారు,నియోజకవర్గంలో దళిత బందు అందించకపోతే  ప్రజా ఆందోళన కార్యక్రమం తీవ్రతారం చేస్తామని, పోలీస్ వాళ్ళని ఊసగోలిపి మమ్మల్ని నిర్భందినచ్చాలని చూస్తే నిన్ను మండలంలో అడుగు పెట్టానియము అని హెచ్చరించారు. ఈ రాస్తా రోకా కార్యక్రములో  బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల.సంతోష్,బత్తిని. స్వామి,జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లరం ప్రసన్న,జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు దామెర.కృష్ణ, మండల బీజేపీ యువమోర్చ అధ్యక్షులు బండారి. రాజు,దళిత మోర్చా ఉపాధ్యక్షులు మామిడి.శేఖర్,ఓబీసీ అధ్యక్షులు అనగోని అవినాష్,ప్రచార కార్యదర్శి సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్,మండల బీజేపీ నాయకులు ఎస్.పి.రెడ్డి, ఎలుక.వర్ధన్, అంతటి. వేణు,కే.రవీందర్ రెడ్డి పొట్ల.వెంకటేష్,తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments