JSON Variables

తాండూర్ మండలం MPPS బారేపల్లి పాఠశాలలో ఉగాది సంబరాలు

తాండూర్ మండలం MPPS బారేపల్లి పాఠశాలలో ఉగాది సంబరాలు 

బెల్లంపల్లి న్యూస్ పవర్ రిపోర్టర్

తేదీ / 01/04/2022 శుక్రవారం రోజున  శుభకృత్ తెలుగు నామ సంవత్సర ఉగాది  సంబరాలు పురస్కరించుకొని మనిషి జీవితంలో సంతోషాలు బాధలు కష్టసుఖాలు ఎలా ఉంటాయో అలాగే ఉగాది పండుగ రోజున తీపి చేదు కారం పులుపు ఓగరు ఉప్పు  ఇలా ఆరు రుచులు అన్నీ కలగలిపి మనకు  గుర్తుచేస్తున్న ఈ ఉగాది పండుగను అంగరంగ వైభవంగా  MPPS బారెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో ప్రధానోపాధ్యాయురాలు మరియు స్టాఫ్ అందరూ కలిసి ఉగాది సంబరాలు సంతోషంగా  జరుపుకోవడం జరిగినది. ఉగాది పచ్చడి చేసి విద్యార్థులకు పంచడం జరిగినది. శుభకృత్ సంవత్సరం లో అందరికి శుభాలు జరగాలని కోరుకుంటూ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ  కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  LFL HM j. రాజేశ్వరి గారు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగినది

Post a Comment

0 Comments