JSON Variables

రైతాంగం ఉద్యమించాలి,పాలకులకు బుద్ధి చెప్పాలి-MCPIU జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపు

రైతాంగం ఉద్యమించాలి,పాలకులకు బుద్ధి చెప్పాలి-MCPIU జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపు

న్యూస్ పవర్ రిపోర్టర్ బెల్లంపల్లి

ఈరోజు కన్నెపల్లి మండలంలోని జజ్జరవేల్లి గ్రామంలో అఖిలభారత రైతు సమాఖ్య(AIKF)మంచిర్యాల జిల్లా మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు MCPIU జిల్లాకార్యదర్శి,AIKF రాష్ట్ర నాయకులు సబ్బని కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై AIKFజెండాను ఎగురవేసి మహాసభలను ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలవల్ల వ్యవసాయం దివాలా తీసిందని,రైతాంగం అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ వ్యవసాయాన్ని లాభసాటి చేస్తానని, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం పెట్టుబడి అదనంగా 50శాతం గిట్టుబాటు ధర కల్పిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకు వచ్చి ఆదాని,అంబానీలలాంటి పెద్దపెద్ద కార్పొరేట్ శక్తులకు దేశసంపదను కట్ట పెట్టుటకు పూనుకున్నారని,నల్ల చట్టాలు రద్దు కావాలని,రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పార్లమెంటులో చట్టం చేయాలని ల్,రాష్ట్రాల హక్కులను హరించే విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని సంవత్సరానికి పైగా జరిగిన ఉద్యమాలలో సుమారు 900 మంది రైతులు అమరులైనారని,ఈ పోరాటంలో AIKF తన శక్తివంచన లేకుండా ప్రధాన భూమిక పోషించిందని నీళ్లు నిధులు నియామకాలు పేరుతో అధికారం మీదికి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం అవి అమలు చేయకపోగా నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలలో భాగంగా రైతుబంధు పేరుతో నగదు ఇచ్చి ఎరువులపై సబ్సిడీ ఎత్తి వేసిందని ఫలితంగా ఎరువుల ధరలు బాగా పెరిగాయని సాదాబైనామా పేరుతో పట్టా చేసిన దాంట్లో లో కాస్ట్ తో కాలం తీసేసి వాస్తవ సాగుదారులు హక్కులను తీసేశారని,కౌలుదారులకు ఇచ్చిన హామీలు అమలుకు పూనుకోలేదని,వరి ధాన్యం వేయొద్దని కేంద్రం కొనుగోలు చేయదని ఒకసారి,రాష్ట్ర ప్రభుత్వం చివరి వరకు కొనుగోలు చేస్తామని మరొకసారి అంతుచిక్కని హామీలతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని,ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని రక్షిద్దాం- దేశాన్ని కాపాడుదాం అనే నినాదంతో దేశవ్యాప్త రైతు ఉద్యమం చేపడుతూ,ఎక్కడ రైతాంగం అన్యాయానికి గురైన వెంటనే స్పందిస్తూ రైతులకు అండగా నిలిచి పోరాడుతున్నా AIKF అన్ని రైతు సంఘాలను, రైతుశ్రేయోభిలాషులను కలుపుకొని రైతు వ్యతిరేక సాగు చట్టాలకు వ్యతిరేకంగా మార్కెట్ సమస్యలపై రైతాంగం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో AIKF జిల్లానాయకులు లింగంపల్లి శంకర్, దుర్గం విఠల్, తాళ్లపల్లి రాజలింగు,మెరుగు ప్రసాద్,మల్లేష్, భోగి లక్ష్మి, కామెర లక్ష్మి,దుర్గం సంతోష్,రాములు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments