JSON Variables

మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి.. మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ ఐపీ ఎస్

మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి.. మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ ఐపీ ఎస్
 న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం
ఈరోజు రామగుండం కమిషనరేట్ చంద్రశేఖర్రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో పద్మశాలి భవన్ లో ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.డీసీపీ మాట్లాడుతూ... శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా సంయమనంతో వ్యవహరించాలని సూచిం చారు. పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. హిందువులు శ్రీరామనవమి వేడుకలను సామరస్యంగా నిర్వహించుకోవాలన్నారు. అన్ని మతాల వారు పరస్పరం సోదరభావంతో సహకరించుకొని పండుగలను నిర్వహించుకోవాలన్నారు.అన్ని వర్గాల ప్రజలు మతాలక తీతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కలిసి ఎవరి పండుగలను వారు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. రంజాన్ మాసం ప్రారంభమైందని, ఈ నెల 10న శ్రీరామనవమి,15న గుడ్ ఫ్రైడే, మే 3న రంజాన్ వచ్చే పండుగల్లో అందరూ కలిసి ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అవాంతరాలు, అల్లర్లు జరుగకుండా కమిటీ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలకు ఇబ్బంది చిరాకు కలిగించేందుకు దారి తీసే లౌడ్ స్పీకర్లు డీజే లు వంటివి నిషేధించడం జరిగిందని వీటి అనుమతి కావాలంటే ముందస్తుగా సబ్ డివిజన్ పరిధిలోని ఏ సి పి గారికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఊరేగింపు లో భాగంగా వాహనాలకు మైకులు వంటివి కూడా నిషేధించడం జరిగిందని ఆయన తెలిపారు. పండుగలు ముగిసేంత వరకు అందరూ సోదరభావంతో కలిసిమెలిసి మెదగాలని ఏసిపి కోరారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ బాబురావు, వన్ టౌన్ సిఐ రాజు ,మందమరి సిఐ ప్రమోద్ రావు ,తాండూర్ సీఐ జగదీష్ తో పాటు డివిజన్ పరిధిలోని ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments