కూరెల్ల గ్రామం లో అంగరంగ వైభవంగా జరిగిన సీతా రాముల వారి కళ్యాణం
న్యూస్ పవర్ రిపోర్టర్
రేవొజు రాజ బ్రహ్మచారి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామం లో హనుమాన్ ఆలయం లో జరిగిన సీతారాముల కళ్యాణం ఇట్టి కళ్యాణ మహోత్సవానికి గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ జ్యోతి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం ని జరిపించిన దంపతులు గాజుల రవీందర్ లతా స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గాజుల రమేష్ మాట్లాడుతూ ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మా కొడుకు గాజుల రవీందర్ తమ సొంత ఖర్చులతో కల్యాణ నిర్వహించి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వారికి శాలువాలతో ఘనంగా సన్మానించి అలాగే వారి కుటుంబానికి ఆ సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళలా ప్రసాదించాలని ఆ గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఉండాలి అని పాడిపంటలతో స్వామివారిని వేడుకున్నారు.
ఈ కళ్యాణ కార్యక్రమానికి గ్రామ సర్పంచి గాజుల రమేష్. తో పాటు గాజుల వెంకటయ్య. గారి కుమారుడు గాజుల రవీందర్- లత అలాగే గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments