JSON Variables

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు


News power bellampalli

మహిళలు పురుషులతో సమానంగా రాణించాలి.కలెక్టర్ భారతి హోలీ కేరి
 ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నేం 2 గ్రౌండ్ ఆవరణలో బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్ అధ్వర్యంలో షీ టీమ్ నేతృత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్బంగా నేటి సమాజంలో పిల్లలను మంచి మార్గంలో నడిపించడానికి తల్లి పాత్ర, ఉద్యోగం, మహిళా సాధికారత తదితర అంశాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి,  మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేరి,  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళకేరీ అన్నారు. ప్రస్తుత సమాజంలో లింగ వివక్షత చూపుతున్నారని ఇది సరైంది కాదని పేర్కొన్నారు. జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నారని ప్రతి రంగంలో మహిళలు దూసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కొడుకులు, కూతుర్లను ఒకే విధంగా చూడాలని పేర్కొన్నారు. ప్రతి రంగంలో మహిళలు పురుషులతో సమానంగా ఎదగాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత మైన లక్ష్యాలను పెట్టుకుని చదువుకోవాలన్నారు. ఇంట్లో స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం విద్యావంతులవుతారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ... మహిళల రక్షణ, భద్రతకై పోలీసు శాఖ  ముందంజలో ఉంటు మహిళల భద్రతకు పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉండి, సత్వరమే స్పందిస్తారన్నారు.
మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందన్నారు.ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూ... మరోవైపు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని... అప్పుడే సమాజం, దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని చెప్పారు.కమీషనరేట్ పరిధిలో  మహిళల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షీటిమ్స్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహిళకు రక్షణ కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలు రాజకీయ చైతన్యవంతులై దేశాలను పాలించగల అవుతున్నారు మహిళలను మరింత ప్రోత్సహించితే దేశం రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది మహిళ అనే పదము లో విలువ ఉందని  తల్లిగా భార్యగా  ఆడబిడ్డగా  జీవితాన్ని త్యాగం చేస్తూ సృష్టికి ప్రతి సృష్టి నిర్మిస్తున్న శక్తి మహిళ అని కొనియాడారు ప్రపంచవ్యాప్తంగా మహిళలు విద్య, వైద్యం, సామాజిక, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి, సాంకేతిక రంగాల్లో పనిచేస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం గర్వకారణమన్నారు.మాహిళలు సామజిక, అర్థిక, రాజకీయ, రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు మాహిళలు నిర్బయంగా వుండాలి. నిస్సంకోచంగా మాట్లాడాలి, సాహసోపేతంగా, జీవించాలి, మాహిళలఫై సమాజం మరుతున్నపుడు మగవారి మైండ్ సెట్ కుడా మారాలి, మాహిళలు ఈ రోజులలో తాము ఎందులోనూ మగవారికన్నా తక్కువ కాదన్నా విషయాన్ని నిరుపించుకుంటున్నారని తెలిపినారు.ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.... మహిళలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. మహిళల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు | 2. ప్రభుత్వం 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల భద్రత | కోసం షీటీంలను ఏర్పాటు చేసిందని, ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. పోలీసులు మహిళ దినోత్సవం సం దర్భంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ ఎడ్ల మహేష్ ను అభినందించారు. అనంతరం పారిశుధ్య, మహిళ కూరగాయల వ్యాపారులు, మహిళ పారిశుధ్య కార్మికులను, ఏఎన్ఎంలను, మహిళ రైతులను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలోఅసిస్టెంట్ కలెక్టర్,డీఎస్వో శివా నీడోంగ్రె, బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు. ఆర్జీవో శ్యామలాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, మార్కెట్ కమిటీ చైర్మన్ గడం కల్పాని, మున్సిపల్ కమీషనర్ రజిత, జిల్లాలోని మహిళ ఏస్ఐలు, సిబ్బంది, 10 వేల మంది మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments