JSON Variables

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు రోగులకు అన్నదానం

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు రోగులకు అన్నదానం
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోసాయి భోజన్ మహా అన్నదానం నిర్వహణ
స్కానింగ్, చెకప్ లకు వచ్చే వారికి కడుపు నింపే కార్యక్రమం
ప్రతి మంగళవారం అందుబాటులో సాయి భోజన్ అన్నదాన సేవలు

బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన గర్భిణులు మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి స్కానింగ్ నిమిత్తం రాగా వారికి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జక్కం ఉషశ్రీ, గుప్త దాతల సహకారంతో అన్నదానం చేపట్టారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతి మంగళవారం చుట్టుపక్కల మండలాల నుంచి గర్భిణులు స్కానింగ్ మరియు వివిధ చెకప్ ల నిమిత్తం వస్తుంటారు. ఇందులో భాగంగా మంగళవారం రోజు కూడా చాలామంది గర్భిణులు రోగులు వచ్చారు. అయితే వారికి మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది అవుతున్న విషయం బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారి దృష్టికి వచ్చింది. దీంతో వారు స్పందించి ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం సాయి భోజన్ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు . అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా సోదరీమణులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం అన్నదాన సేవ
బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో  ప్రతి మంగళవారం గర్భిణులకు రోగులకు సాయి భోజన్ అన్నదానం నిర్వహించనున్నట్లు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు కాంపల్లి రా శంకర్ రాజేశ్వరి తెలిపారు. అందరికీ కడుపు నింపే తల్లుల కడుపు నింపేందుకు తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు వారు చెప్పారు. కాగా, తమ కడుపు నింపిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆనందం వ్యక్తం చేశారు.సాయం అందించాలనుకొంటే సంప్రదించండి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తి పరిచామని  పేర్కొన్నారు. అన్నార్థులు, అనాధలకు సహాయం అందించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు మోటపలుకుల తిరుపతి, జక్కం నాగమణి దుర్గం మారుతీ ప్రేమ్, మధు కొడిమాల సంతోష్ , సేవకులు శనిగరపు నరేష్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments