JSON Variables

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి

*భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయాలని చూస్తున్న కేంద్రంలోని BJP ప్రభుత్వానికి బుద్ది చెప్పండి,   ఎంతటి త్యాగానికైనా సిద్ధపడండి,ఈనెల 28,29న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి-AICTU ఆల్ ఇండియా కార్యదర్శి,SIGKS కేంద్రకమిటి ప్రధానకార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపు* 
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

ఈరోజు బెల్లంపల్లి MCPIU పార్టీ కార్యాలయంలో జరిగిన సింగరేణి ఐక్య గని కార్మిక సంఘం (SIGKS) యూనియన్ కేంద్రకమిటి సమావేశంలో సబ్బని కృష్ణ మాట్లాడుతూ
కార్మికవర్గంపై ఉక్కుపాదం మోపుతూ స్వాతంత్య్రానికి పూర్వం నుండి అజరామరమైన ప్రాణ త్యాగాలు,ఉద్యమాలు చేసి కార్మిక చట్టాలను, హక్కులను,ఉద్యోగ భద్రతను మరియు ప్రభుత్వ రంగ సంస్థలను అధికార అహంకారం నెత్తికెక్కి అనాలోచిత విధానాలతో కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తూ గుత్తా పెట్టుబడి దారులకు,కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని,ప్రయివేటు పరం చేయాలని,కార్మికుల హక్కుల్ని హరించాలని ఆరాటపడుతున్న కేంద్రప్రభుత్వానికి గట్టి నిరసన తెలియజేసే విధంగా కార్మికవర్గ పోరాట పటిమను వెలుగెత్తి చాటేవిధంగా బొగ్గుగని కార్మికులు అలాగే LIC, రైల్వే, విమాన,రక్షణ,ఉక్కు,పోస్టల్, బ్యాంకింగ్ తదితర రంగాల ఉద్యోగస్తులు, కార్మికులు మార్చి 28,29 తేదీలలో దేశవ్యాప్తంగా జరుగబోయే సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు కొండ శ్రీనివాస్,పసులేటి వెంకటేష్, తాళ్లపల్లి రాజలింగు, లింగంపల్లి శంకర్,దుర్గం విఠల్, రాజు,ఆకాష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments