JSON Variables

శాసనసభ్యులు సతీష్ కుమార్ కు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కూరెల్ల గ్రామం సర్పంచ్ గాజుల రమేష్ మరియు పాలకవర్గం


న్యూస్ పవర్: రిపోర్టర్
రెవొజు  రాజ బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ మరియు పాలకవర్గం    సింగపూర్ గ్రామానికి వెళ్లి సొంత నివాసంలో శాసనసభ్యులు సతీష్ కుమార్ కు హోలీ శుభాకాంక్షలు తెలిపి సతీష్ కుమార్ కు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

శాసనసభ్యులు సతీష్ కుమార్ తో మాట్లాడుతూ గ్రామ సర్పంచు గ్రామంలో సమస్యలు వివరించి పరిష్కారం చేయాలని కోరగా వెంటనే శాసన సభ్యులు స్పందించి .గ్రామంలో సమస్యలను తప్పకుండా తీరుస్తానని మాట ఇవ్వడం జరిగింది.

ఇటీవల కూరెల్ల గ్రామానికి మంజూరైన ఆస్పటల్ గ్రామ పంచాయతీ భవనం దగ్గర శాసనసభ్యులు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ఇట్టి విషయంపై మన గ్రామానికి చెందిన అనాధ వుద్ధుడు  మడుపు వెంకట్ రెడ్డి మరణించినందున అతని ఇంటి స్థలం ఊరి నడి మధ్యలో ఉన్నందున గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామపంచాయతీ  స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అత్యవసర సేవలు అందించే హాస్పటల్ గనుక ఈ విషయంపై శాసనసభ్యులతో చర్చించి సానుకూలంగా స్పందించారు .అలాగే గ్రామంలో సిసి రోడ్ల శంకుస్థాపన కు ఆహ్వానించగా తప్పకుండా వస్తాం అని చెప్పడం జరిగింది

   ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నముకు ధర్మయ్య. మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి. వార్డు సభ్యులు మార్గం తిరుపతి. గాజుల రవీందర్. ఈగ మల్లయ్య .కోన వేణి మంజుల -రాజు .ఇట్ట వేని రేణుక- కొమురయ్య .బండారి నరేష్. చిట్యాల లక్ష్మీ- శంకర్ .సంపంగి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments