JSON Variables

మహాశివరాత్రి సందర్భంగా బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ వారి మహా అన్నదానం




న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

- బుగ్గ రాజా రాజేశ్వర ఆలయంలో అల్పాహారం అన్నదానం తాగునీరు పంపిణీ
- బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు మరియు రోగులకు కూడా
- పరమశివుని పర్వదినం పురస్కరించుకొని విస్తృత సేవా కార్యక్రమాలు

బెల్లంపల్లి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి లోని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారు విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం తో పాటు పరమశివుని పర్వదినం సందర్భంగా ప్రత్యేక సేవా కార్యక్రమాలను పలు చోట్ల నిర్వహించారు. మహా శివరాత్రి నేపథ్యంలో బుగ్గ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి తరలి వచ్చిన అశేష భక్తజనానికి అన్నదానం చేశారు ఉదయం పూట ఉపవాసదీక్ష భక్తులకు అల్పాహారం అందజేశారు భక్తులందరికీ ఉచితంగా త్రాగు నీటిని ఉప్మా పంపిణీ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు...
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన గర్భిణులు మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి స్కానింగ్ నిమిత్తం రాగా వారికి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదానం చేపట్టారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతి మంగళవారం చుట్టుపక్కల మండలాల నుంచి గర్భిణులు స్కానింగ్ మరియు వివిధ చెకప్ ల నిమిత్తం వస్తుంటారు. ఇందులో భాగంగా మహా శివరాత్రి పండుగ రోజైన మంగళవారం కూడా  గర్భిణులు వచ్చారు. అయితే వారికి మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది కాకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలతోపాటు రోగులకు కూడా సాయి భోజన్ అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
 ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం అన్నదాన సేవ
బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇక నుంచి ప్రతి మంగళవారం గర్భిణులకు, పెషేంట్ లకు సాయి భోజన్ అన్నదానం నిర్వహించనున్నట్లు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు కాంపల్లి శంకర్ రాజేశ్వరి  తెలిపారు. అందరికీ కడుపు నింపే తల్లుల కడుపు నింపేందుకు తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు వారు చెప్పారు. కాగా, తమ కడుపు నింపిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆనందం వ్యక్తం చేశారు.
సాయం అందించాలనుకొంటే సంప్రదించండి
బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ రాజేశ్వరి,  తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తూ అతిథిగా సత్కరిస్తున్నామని పేర్కొన్నారు. అన్నార్థులు, అనాధలకు సహాయం అందించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు మోటపలుకుల తిరుపతి, నల్ల శ్రీనివాస్, కొడిమాల సంతోష్ ,దుర్గం మారుతీ ప్రేమ్, మధు,ఈసారపు భాస్కర్, తాళ్లపల్లి సన్నీ మరియు సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments