JSON Variables

ప్రధాన మంత్రి మోడీ రైతులకు బహిరంగ క్షమాపన చెప్పాలి,రైతుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలుచేయాలి-MCPI(U) జిల్లా కార్యదర్శిసబ్బని కృష్ణ డిమాండ్


న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

ఈరోజు బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో MCPIU జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజును రైతు విద్రోహ దినంగా పాటించాలని నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్లు వ్రాతపూర్వక హామీ ఇచ్చి రైతు లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేస్తామని, మరణించిన రైతు కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని, పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తెస్తామని,లఖింపూర్ మృతి రైతు కుటుంబాలకు న్యాయం చేస్తామని,నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నో రకాల హామీలిచ్చి అమలు చేయకుండా విద్రోహానికి పాల్పడ్డారని,రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని,చనిపోయిన రైతుల కుటుంబాలకు 50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని,అజయ్ మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో MCPIU, AIKF నాయకులు కొండ శ్రీనివాస్,ఆరెపల్లి రమేష్,పసులేటి వెంకటేష్,సబ్బని రాజేంద్రప్రసాద్,దుర్గం విఠల్, లింగంపల్లి శంకర్, కామెర పద్మ,మల్లేష్,సంతోష్,అంబాల రాజారావు,బాలునాయక్, పీరయ్య,వంశీ,రాజం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments