JSON Variables

భూమిని సాగు చేసుకొని బతకమని పేదలకు ఇస్తే అమ్ముకొని బతుకుతున్నారు

భూమిని సాగు చేసుకొని బతకమని పేదలకు ఇస్తే అమ్ముకొని బతుకుతున్నారు
అమాయక ప్రజలను మోసం చేస్తున్న రియల్టర్లు

ప్రభుత్వ నిబంధనల మేరకు అసైన్డ్ లావుని భూములను రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్.


  న్యూస్ పవర్ మంచిర్యాల, డిసెంబర్ 29: తాండూర్ మండలం కిష్టంపేట ఏజెన్సీ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్23 రైతు వేదిక సమీపంలో ఉన్న అసైన్డ్ భూములను కొందరు రియలేస్టేట్ వ్యాపారులు అట్టిభూమిని ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారి బినామీల పేరున చేసుకొని కొన్ని రోజుల తర్వాత గుంటల లెక్కన క్రయవిక్రయాలు చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ మొమిన్ ఆలీ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలో భూముల క్రయవిక్రయాలు చేయవద్దని ఆంక్షలు ఉన్న రియల్టర్లుగా అవతరమెత్తి లావుని అసైన్డ్ భూములను కొనుగోలు చేసి రియల్ స్టేట్ దందాలు చేస్తూ ఇప్పటి వరకు అసైన్డ్ భూమిలో 16 గుంటలు గుట్టు చప్పుడు కాకుండా అమాయక ప్రజలకు అమ్మడం జరిగిందని. అట్టి అసైన్డ్ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ  జూనియర్ కళాశాల,మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలకు స్థలాన్ని కేటాయించలని ఈనెల 24న కిష్టంపేట కు చెందిన బియ్యాల నరేందర్ తాహసీల్దార్ కు వినతి పత్రం  అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రోజు వరకు రెవిన్యూ  అధికారులు స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మండలంలో కొత్తపల్లి, పోచంపల్లి అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేసినట్టుగా కిష్టంపేట అసైన్డ్  భూమిలో రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.. లేని యెడల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బియ్యల నరేందర్, జైన సాంబయ్య,షేక్ ఆయూబ్ పాల్గొన్నారు..

Post a Comment

0 Comments